30-04-2025 12:00:00 AM
గడ్కరీకి ఎంపీడీ డీకే అరుణ వినతి
హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ పెరిగిపోయిందని, ఈ రోడ్డును 6 లేన్లుగా విస్తరించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కోరారు. దేశంలోని రోడ్లు, హైవేల నిర్మాణాలు, ట్రాన్స్‌పోర్టు ప్రాజెక్టులలో తలెత్తుతున్న అవరోధాలను అధిగమించేందుకు -ఢిల్లీలో మంగళవారం నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ తొలి సమావేశంలో డీకే అరుణ పాల్గొన్నారు.
బెంగళూరు హైవేపై రద్దీ పెరిగిన కారణంగా 6 లేన్ల రోడ్డును చేపట్టాలని కోరారు. తన పార్లమెంట్ పరిధిలోని రోడ్లు, రహదారుల నిర్మాణం, హైవేలకు ప్రతిపాదనలు ఇబ్బందులను ఆమె ప్రస్తావించారు. మహబూబ్‌నగర్ బైపాస్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు.
కొత్తకోట నుంచి గద్వాల మీదుగా మంత్రాయలం వరకు నిర్మించే హైవే ప్రతిపాదనలను త్వరగా అమల్లోకి వచ్చేలా చూడాలన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి నుంచి గద్వాల మీదుగా కర్ణాటకలోని రాయచూరుకు 4లేన్ హైవే నిర్మాణం చేపట్టాలని కోరారు. మహబూబ్ నగర్ బైపాస్ రోడ్డు, మరికల్ మీదుగా కర్నాటకకు హైవే నిర్మించాలన్నారు.