calender_icon.png 17 January, 2025 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో భారీ చోరీ

17-01-2025 10:07:52 AM

హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiah)కు దొంగలు షాక్ ఇచ్చారు. ఫిలింనగర్ లోని పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో దొంగలు పడ్డారు. దుండగులు పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో నుంచి రూ. 1.50 లక్షల నగదు, భారీగా అభరణాలు ఎత్తుకెళ్లారు. చోరీ జరిగినట్లు గ్రహించిన పొన్నాల సతీమణి అరుణాదేవి ఫిలింనగర్ పోలీసుల(Filmnagar Police Station)ను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, చోరీ(theft) జరిగిన సమయంలో పొన్నాల లక్ష్మయ్య కుటుంబసభ్యులు ఇంట్లో లేమని, జనగామాలో ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చోరీకి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.