రాజేంద్రనగర్, ఆగస్టు 30: నందిగామ మండలం చేగూరుకు చెందిన సరిత, నర్సింహ దంపతుల కూతురు తారాచంద్రికతో మైలార్‌దేవ్‌పల్లిలో ఉంటున్నారు. ఇంటర్ చదువుతున్న తారాచంద్రిక ఈ నెల 18న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ౪ రోజుల క్రితం మహేశ్వరం మండలం నాగారానికి చెందిన యువకుడు బాలిక సెల్‌ఫోన్‌కు కాల్ చేశాడు. అనుమానించిన పేరెంట్స్ ప్రేమ వేధింపులతోనే కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని అనుమానిస్తూ మై లార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం చేగూరులో ఖననం చేసిన బాలిక మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేశారు.