- బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
- గల్ఫ్ ఎక్స్‌గ్రేషియా మంజూరు పత్రం అందజేత
కరీంనగర్, అక్టోబర్ 30 (విజయక్రాం తి): గల్ఫ్‌లో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ.౫ లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం దేశ చరిత్రలో ప్రథమమని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
సౌదీ అరేబియాలో మృతిచెందిన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం కు చెందిన పులి అంజయ్య కుటుంబానికి మంగళవారం రాత్రి రూ.5 లక్షల గల్ఫ్ ఎక్స్‌గ్రేషియా మంజూరు పత్రాన్ని పొన్నం ప్రభా కర్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గల్ఫ్ కార్మికులు, ఎన్నారైలు తమ సమస్యలు విన్నవించుకోవడానికి హైదరాబాద్ ప్రజాభవన్‌లో ప్రవాసీ ప్రజావాణి కౌంటర్‌ను ఏర్పాటు చేశామని తెలి పారు.
గల్ఫ్ కార్మికులు సమస్యల అధ్యయ నం చేసి ప్రభుత్వానికి సూచనలు చేయడానికి త్వరలో అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు.