23-02-2025 12:00:00 AM
ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ వ్యాయామం చేయడం ఎంతో అవసరం. ఫిట్‌నెస్ విషయంలో శ్రద్ధ వహించడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. క్రమం తప్పకుండా వర్కవుట్లు చేయడం వల్ల హానికర టాక్సిన్లు చెమట రూపంలో బయటకు వెళ్లిపోయి శరీరం తేలికగా అనిపిస్తుంది. అయితే వర్కవుట్లు చేసేముందు ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు.
కడుపు నిండా భోజనం తిన్నాక వర్కవుట్ల జోలికి వెళ్లకూడదు. ఇలా చేస్తే భోజనం అజీర్ణం అవుతుంది. కాబట్టి శరీరంలో అసౌకర్యానికి గురై ఏమైనా జరగవచ్చు.
వ్యాయామానికి కనీసం రెండు గంటల ముందు కెఫీన్, నికోటిన్ తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే ఇవి వణుకు, డీ హైడ్రేషన్‌కి కారణమవుతాయి.
హైడ్రేషన్ తస్పనిసరి అయినప్పటికీ ఎక్కువ నీరు తాగడం వల్ల కడుపులో అసౌకర్యం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది.
బ్లూ లైట్ వల్ల వ్యాయామం చేసేటప్పుడు ఏకాగ్రత లోపిస్తుంది. పరధ్యానం తగ్గించుకోవడానికి వర్కవుట్లు చేసే ముందు కనీసం 30 నిమిషాల ముందు నుంచే స్క్రీన్ ముందు ఉండకూడదు.
వ్యాయామం కోసం గాలి ఆడే, సౌకర్యవంతమైన దుస్తులను ఎంచుకుంటే మంచిది. అప్పుడు వర్కవుట్లపై దృష్టి పెట్టేందుకు వీలవుతుంది.
తీవ్రమైన వ్యాయామానికి ముందు గాయాలను నివారించడానికి, మీ కండరాలను సిద్ధం చేయడానికి ఎల్లప్పుడూ వార్మప్ చేయాలి.
శక్తి స్థాయిలను నిర్వహించడానికి వ్యాయామానికి ఒకటి నుంచి రెండు గంటల ముందు తేలికైన, సమతుల ఆహారం తీసుకోవాలి.
వ్యాయామం చేసేటప్పుడు మీ చర్మం లేదా శ్వాసకోశ వ్యవస్థను చికాకు పెట్టే పెర్ఫ్యుమ్స్ వాడొద్దు.
దినచర్యను ప్రారంభించే ముందు కొత్త వ్యాయామం ట్రై చేస్తుంటే వైద్యుడి సలహా తీసుకోవాలి. ప్రత్యేకించి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు కచ్చితంగా వైద్యుడి సలహా తీసుకోవాల్సిందే.