calender_icon.png 21 September, 2024 | 3:20 AM

పల్లె పోరుకు కసరత్తు

21-09-2024 12:36:55 AM

ఓటరు జాబితాపై సర్వే

గ్రామల్లో ఆశావహుల సందడి

నిర్మల్ జిల్లాలో ఎమ్మెల్యేలకు తలనొప్పిగా అభ్యర్థుల ఎంపిక!

నిర్మల్, సెప్టెంబర్ 20(విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఎన్నికల నిర్వణహకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం ఆ దిశగా ముందుకు సాగుతున్నది. నిర్మల్ జిల్లాలో మొత్తం 19 మండలాలు ఉండగా.. 926 మంది బీఎల్‌వోల ఆధ్వర్యంలో ఓటరు జాబితాలో పేర్లు నమోదు, మార్పులు, చేర్పుల కోసం సర్వే చేపట్టారు. 21వరకు వరకు సర్వే చేపట్టి 26న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు. రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి సమగ్ర ఓటర్ల జాబితాకు సహకరించాలని ఇప్పటికే కలెక్టర్ సమావేశాలు నిర్వహించారు. 

జిల్లాలో ఓటర్ల సంఖ్య 4,40,997

నిర్మల్ జిల్లాలోని 400 గ్రామ పచాయతీల్లో 162 గిరిజన పంచాయతీలు, 3,368 వార్డులు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 4,4 0,997 మంది ఉన్నారు. అందులో మహిళ లు 2,30 836మంది, మగవారు 2,10,146 మంది ఉన్నారు. 650 మందికి ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. 

 నిర్మల్‌లో విభిన్న రాజకీయం

నిర్మల్ జిల్లా రాజకీయ కేంద్రం అయినప్పటికీ రాజకీయ అనిశ్చితి కొనసాగు తో ంది. నిర్మల్ జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. నిర్మల్, ముధోల్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, రామారావు పటేల్ ప్రాతినిధ్యం వహిస్తుండగా ఖానాపూర్ నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యే వడ్మ బొజ్జు పటేల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లేనప్పటికీ గతంలో ఆ పార్టీకి చెందిన నేతలే సర్పంచులుగా ఉన్నారు. దీంతో ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గ్రామాల్లో అభ్యర్థుల ఎంపిక ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఒక్కో పార్టీ నుంచి అనేక మంది ఆశావహులు ఉండటమే దీనికి కారణం. 

రంగంలోకి కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో పార్టీ మద్దతుదా రులను రంగంలోకి దించి గెలిపించుకోవాలని పార్టీ నేతలు చూస్తున్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ, ఇతర పార్టీలు కూ డా తమ పార్టీలకు చెందిన నేతలను బరిలో దింపి సత్తా చాటాలని కార్యచరణ రూపొందించుకొంటున్నాయి. అయితే ఐదేళ్ల క్రితం ఉన్న రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారా, కులగణన చేసిన తర్వాత నిర్వహిస్తారా అనే ఆంశంపై స్పష్టత లేకపోవడంతో ఆశావహులు అయోమయంలో ప డ్డారు. పార్టీల మద్దతు ఉన్న వారికే గె లుపు ఆవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించిన కొందరు ఆశావ హులు ఇప్పటి నుంచే నియోజకవర్గ నేతల చుట్టూ తిరుగుతూ ప్రసన్నం చేసుకుంటున్నారు.