హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 (విజయక్రాంతి): ప్రముఖ షూటర్ ఈషాసింగ్ జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో నిర్మించే నూతత ఇంటికి రూ.55 లక్షల ఎల్‌ఆర్‌ఎస్ చార్జీలను మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. ఈ మేరకు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం దానకిశోర్ సోమవారం జీవో నంబరు 577ను విడుదల చేశారు.
ఈషా సింగ్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో 4 అంతస్తుల భవన నిర్మాణం చేపడుతుండగా, జీహెచ్‌ఎంసీకి చెల్లించాల్సిన ఎల్‌ఆర్‌ఎస్ మొత్తం ఫీజు రూ.55,89,864లను మినహాయించాలని జీహెచ్‌ఎంసీని కోరారు. ఈ విషయమై యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్‌మెంట్ సీఎం కార్యదర్శికి సిఫార్సు లేఖ ను పంపారు. తాజాగా ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం దానకిశోర్ సోమవారం జీవో నెంబర్ 577ను విడుదల చేస్తూ ఎల్‌ఆర్‌ఎస్ చార్జీలను మినహాయించేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు.