హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): గ్రూప్-3 పరీక్షల నేప థ్యంలో సర్వేలో పాల్గొంటున్న పలువురి ఉపాధ్యాయులు, ఉద్యోగులకు మినహాయింపునిచ్చారు. ఈనెల 15 నుంచి 18 వరకు వారికి మినహాయింపునిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ గు రువారం ఉత్తర్వులు జారీ చేసింది. 87 ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల సంస్థ ల్లో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ సి బ్బందికి గ్రూప్-3 విధుల నేపథ్యం లో నాలుగు రోజుల పాటు కులగణన సర్వే నుంచి మినహాయింపు ఇస్తున్న ట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బు ర్రా వెంకటేశం ఉత్తర్వుల్లో తెలిపారు. ఈనెల 17, 18న గ్రూప్-3 పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.