11-02-2025 06:40:23 PM
సీఈఓను కోరిన టీఎస్ యుటిఎఫ్ నాయకులు..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆరు నెలల లోపు పదవీ విరమణ చేస్తున్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యుటిఎఫ్ నాయకులు కోరారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ మంగళవారం జిల్లా పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం ముఖ్య కార్యనిర్వాహణాధికారి బి.నాగలక్ష్మిని కలిసి వినతి పత్రం అందజేశారు.
త్వరలో జరగనున్న ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు విధులు కేటాయించే సమయంలో ఆరు నెలల లోపు పదవి విరమణ పొందే ఉపాధ్యాయులను, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిని, పదవ తరగతి సబ్జెక్టు హ్యాండ్లింగ్ ఉపాధ్యాయులను మినహాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బి రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి వెంకటేశ్వర్లు, జిల్లా కోశాధికారి ఎస్ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి డి. తావూరియా పాల్గొన్నారు.