03-04-2025 10:09:55 PM
మరమ్మత్తుకు నోచుకొని పెండింగ్ పనులపై ఆరా
సయ్యద్ అహ్మద్ జానీ..
చర్ల (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గల తాలిపేరు ప్రాజెక్టును సయ్యద్ అహ్మద్ జానీ కార్యనిర్వహక ఇంజినీర్ ప్రి-మాన్సూన్ ఇన్స్పెక్షన్ లో భాగంగా గురువారం తనిఖీ చేసారు. ప్రాజెక్ట్ వద్ద పెండింగులో ఉన్న పనులను గూర్చి తాలిపేరు ప్రాజెక్ట్, డి.ఇ.ఇ. తిరుపతిని అడిగి తెలుసుకున్నారు. పనులన్నింటినీ వర్షాకాలం లోపే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎడమ కాలువకు రెండవ పంటకు నీటి సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. రెండో పంట నీళ్లను కూడా ఈ నెల 10వ తేది వరకు వదిలి, సత్వరమే తాలిపేరు ప్రధాన కాలువలపై అండర్ టన్నెల్ ల నిర్మాణ, ఇతర మరమ్మత్తు పనులను కూడా ప్రారంభించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో AEE లు ఉపేందర్, సంపత్, సిబ్బంది పాల్గొన్నారు.