అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్, జనవరి 6 (విజయ క్రాంతి): సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో కామన్ మెనూ పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ విజయేం దిర బోయి ఆదేశించారు సోమవారం కలెక్ట ర్ కార్యాలయం లో మినీ సమావేశ హాల్ లో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడె న్షియల్ పాఠశాలలు, కేజీబీవీ ల,ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంక్షేమ అధికారులతో కలె క్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ డైట్ చార్జీల పెరుగుదల కనుగుణంగా కామన్ మె నూ అమలు చేయాలని ఆదేశించారు విద్యా ర్థుల భోజనంలో తాజా కూరగాయల విని యోగం, వంట గది పరిసరాలు ఆరోగ్యక రంగా పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. బాలికల భద్రతకు చర్యలు తీసుకోవాలని, సి.సి.కెమెరాలు పని చేసే విధంగా చర్యకు తీసుకోవాలని ఆదేశించారు.
వసతి గృహాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా తదితర అంశాలపై సమీక్షించారు. ఫుడ్ రిజిస్టర్ నిర్వ హణ, విద్యార్థుల ఆరోగ్య చెకప్, సేఫ్టీ ఆడిట్ తదితర విషయాలపై కలెక్టర్ సమీక్షించారు. వసతి గృహాల్లో రిపేర్‌లు ఉంటే ప్రతి పాద నలు సమర్పించాలని అన్నారు. ఏమైనా ఇతర సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ సమావేశా నికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఎస్.సి, ఎస్ టి.బి.సి., మైనార్టీ సంక్షే మ శాఖల అధికారులు,గురుకుల పాఠశా లల అర్.సి.ఓలు పాల్గొన్నారు.