calender_icon.png 27 January, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన్నించండి!

15-08-2024 12:00:00 AM

వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రభాస్‌కు సరసన మృణాల్ ఠాకూర్ జోడీ కట్టబోదంటూ ప్రచారం జరుగుతోంది. ప్రభాస్‌కు సంబంధించిన ప్రాజెక్టుల్లో దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రం కూడా ఒకటి. ఈ చిత్రానికి ‘ఫౌజి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పీరియాడిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఇదే నెల 17న అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు తెలుస్తోంది. అందుకు ఇంకా రెండు రోజుల సమయం ఉండగా..  ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా ఎంపికయ్యిందంటూ వార్తలు వచ్చాయి. ఈ ప్రచారంపై మృణాల్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ‘మీ ఊహాగానాలకు పుల్‌స్టాప్ పెడుతున్నందుకు మన్నించండి.. ఈ ప్రాజెక్టులో నేను లేను’ అని కామెంట్ చేసింది.