calender_icon.png 8 October, 2024 | 4:56 AM

హైడ్రాకు ప్రత్యేక యాప్

08-10-2024 02:56:07 AM

అందులోనే ఫిర్యాదులు.. అధికారుల చర్యల వివరాలు

శాస్త్రీయ పద్ధతుల్లో ఎఫ్టీఎల్ నిర్ధారణ

హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడి

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 7 (విజయక్రాంతి): గ్రేటర్‌లోని ఆక్రమణలకు గురైన చెరువులను పరిరక్షించ డంతోపాటు చెరువులకు పూర్వ వైభవం తెచ్చేందుకు హైడ్రా ప్రణాళికలు రూపొందిస్తోందని హైడ్రా కమిషనర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ ఏవీ రంగనాథ్ తెలిపారు.

చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లను గుర్తించేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో సోమవారం బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. ఆక్రమణలకు ఆస్కారం లేకుండా నూతన యాప్‌ను తెస్తున్నామని, ఆక్రమణల సమాచారం హైడ్రాకు చేరేలా ఈ యాప్ రూపొందిస్తున్నట్టు చెప్పారు.

యాప్ ద్వారానే ప్రజల నుంచి ఫిర్యాదులు, క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన, చర్యలను తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్టు స్పష్టంచేశారు. చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ప్రజావసరాలకు నిర్ధేశించిన స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా నిరంతర నిఘా పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆక్రమణలను తొలగించిన చెరువుల్లో డెబ్రీస్‌ను పూర్తిస్థాయిలో తొలగించడానికి ఏర్పాటు చేస్తున్నామని రంగనాథ్ తెలిపారు.

మెద టి దశలో సున్నం చెరువు, అప్ప చెరు వు, ఎర్రకుంట, కూకట్‌పల్లి నల్లచెరువులో పనులు ప్రారంభించాలని నిర్ణ యించినట్టు చెప్పారు. ఓఆర్‌ఆర్ పరిధిలో ఎన్ని చెరువులున్నాయి? ఎంత మేర ఆక్రమణలకు గురయ్యాయి? అనే లెక్కలు తేల్చాలని అధికారులను ఆదేశించారు. చెరువుల ఎఫ్టీఎల్‌ను నిర్దారించేందుకు శాస్తీయ పద్ధతులను అనుసరించాలని సూచించారు.

గతంలో నిర్ధారించిన ఎఫ్టీఎల్‌లు సరి గా లేకపోతే వాటిని సవరించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. 45 ఏండ్ల రికార్డుల ఆధారంగా చెరువుల ఎఫ్టీఎల్, మాగ్జిమమ్ వాటర్ స్ప్రెడ్ ఏరియాను గుర్తించాలని సూచించారు. ఇందుకు ఎన్‌ఆర్‌ఎస్‌ఏ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, ఇరిగేషన్ విభాగాల రికార్డులతో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.

విలేజీ మ్యాప్స్, భూవినియోగం సర్వే నంబర్లు సహా సమా చారం ఇచ్చే కాడాస్ట్రల్ మ్యాప్స్, 45 ఏండ్లలో పూర్తి స్థాయి చెరువు నీరు విస్తరించిన తీరుపై సమాచారం సేకరించాలని సూచించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల గుర్తింపును హిమాయత్‌సాగర్‌తో ప్రారంభిస్తామని తెలిపా రు.

చెరువుల ఆక్రమణలపై 2018లో వచ్చిన కాగ్ నివేదికను పరిశీలించాలని, ఎక్కడా పొరపాట్లకు ఆస్కారం లేకుండా చెరువులను గుర్తించేందుకు కసరత్తు చేయాలన్నారు. చెరువుల పరిరక్షణపై ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపైనా సమీక్షలో చర్చించారు.