calender_icon.png 26 December, 2024 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బదిలీల్లో మమ్మల్ని మినహాయించండి

15-07-2024 01:46:48 AM

ఎమ్మెల్యే తెల్లంను కలిసి ఆవేదన వ్యక్తం చేసిన అర్చకులు

భద్రాచలం,  జూలై 14 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల సాధారణ బదిలీల జాబితాతో పాటు ఈసారి  ప్రధాన ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న అర్చకులను చేర్చడం వివాదానికి దారి తీస్తోంది. ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క ఆగమశాస్త్రం ప్రకారం స్వామివారికి, అమ్మవారికి పూజాదికాలు నిర్వహిస్తుంటారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో  పాంచరాత్ర ఆగమన సిద్ధాంతం ప్రకారం రామయ్యకు పూజలు నిర్వహిస్తుంటారు.

దశాబ్దాల కాలంగా ఒక ఆగమన సిద్ధాంతం ప్రకారం పూజలకు అలవాటుపడిన అర్చకులను వేరే దేవస్థానానికి బదిలీ చేస్తే అక్కడ మరో ఆగమన సిద్ధ్దాంతం ప్రకారం పూజలు చేయమనడం సబబుకాదని, ఇది ఆగమన శాస్త్రానికి విఘాతం అని అర్చకులు  వాపోతున్నారు. గతంలో అర్చకులు మినహా కేవలం శాకాపరమైన సిబ్బంది మాత్రమే బదిలీ అయ్యేవారు. ఈసారి అర్చకులను సైతం బదిలీల్లో చేర్చడంతో వారు అంతర్మథనంలో పడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాన ఆలయాలు సహా దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాల్లో అర్చకులుగా నిర్వహిస్తున్న వారి జాబితా ప్రభుత్వం సేకరించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై అర్చకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.