calender_icon.png 22 January, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోరెత్తిస్తున్న సాకర్

04-07-2024 12:16:12 AM

  • ఇటు యూరో.. అటు కోపా అమెరికా
  • క్వార్టర్స్‌కు చేరిన రెండు టోర్నీలు

పాశ్చాత్య దేశాలు విపరీతంగా ఇష్టపడే ఫుట్‌బాల్ క్రీడలో.. రెండు ప్రధాన టోర్నీలు క్వార్టర్ ఫైనల్ దశకు చేరాయి. విశ్వవ్యాప్తంగా అత్యధిక ఆదరణ కలిగిన సాకర్‌లో ఇటు యూరో కప్.. అటు కోపా అమెరికా కప్ అభిమానులను అలరిస్తున్నాయి. యూరో కప్‌లో పోర్చుగల్, ఫ్రాన్స్, జెర్మనీ, స్పెయిన్, టర్కీ, నెదర్లాండ్స్, ఇంగ్లండ్, స్విట్జర్లాండ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరగా.. కోపా అమెరికా చాంపియన్‌షిప్‌లో అర్జెంటీనా, ఈక్వెడార్, వెనుజులా, కెనడా, కొలంబియా, పనామా, ఉరుగ్వే, బ్రెజిల్ ముందంజ వేశాయి.

లైప్‌జిగ్ (జర్మనీ): మ్యాచ్ ఆరంభ నిమిషంలోనే గోల్ కొట్టడంతో పాటు.. చివరి క్షణాల్లో అద్భుత డిఫెన్స్‌తో ఆకట్టుకున్న టర్కీ జట్టు.. యూరోపియన్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో టర్కీ 2 ఆస్ట్రియాను చిత్తుచేసింది. టర్కీ తరఫున మెరీహ్ డెమిరాల్ (1వ, 59వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో సత్తాచాటాడు. ఆస్ట్రియా తరఫున మైఖేల్ గ్రెగోరిస్టిక్ (66వ ని.లో) ఒక గోల్ సాధించాడు. ఆదివారం జరగనున్న క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్‌తో టర్కీ అమీతుమీ తేల్చుకోనుంది. 

మరోవైపు కోపా అమెరికా కప్‌లో బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం బ్రెజిల్, కొలంబియా మధ్య జరిగిన గ్రూప్ దశ చివరి పోరు 1 డ్రాగా ముగిసింది. బ్రెజిల్ తరఫున రపిన్హా (12వ నిమిషంలో) ఒక గోల్ కొట్టగా.. కొలంబియా తరఫున డానియల్ మునోజ్ (47వ ని.లో) ఏకైక గోల్ సాధించాడు.