calender_icon.png 18 January, 2025 | 7:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్సాహంగా అన్సారి క్రికెట్ టోర్నమెంట్

18-01-2025 12:08:16 AM

మేడిపల్లి, జనవరి17 : యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించమే లక్ష్యంగా అన్సారి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో బాబు రావ్ గ్రౌండ్స్ నందు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఉప్పల్ సీసన్1 ఉత్సాహంగా సాగింది. శుక్రవారం జరిగిన ఫైనల్ లో మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్‌ఎస్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మా రెడ్డి, పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన బోరబండ జట్టుకు రూ.40,000/- నగదు తో పాటు ట్రోఫీ, రన్నరప్ గా నిలిచిన పీర్జాదిగూడ జట్టుకు రూ.20,000/- నగదుతో పాటు ట్రోఫీ ని బహుమతిగా అందజేశారు.ఈ సందర్బంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందించడంతో పాటు జ్ఞాపికలను ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, అరటికాయల భాస్కర్ ముదిరాజ్, కార్పొరేటర్లు కొల్తూరి మహేష్,మధుసూదన్ రెడ్డి,  బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, పిల్లి నాగరాజు,పంగ రాజేశ్వర్ రెడ్డి, పంగ మహేందర్ రెడ్డి, రంగ, భాస్కర్,కృష్ణ,నాగిరెడ్డి, షరీఫ్,ప్రమోద్ రాజు తదితరులు పాల్గొన్నారు.