calender_icon.png 21 January, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్కంఠభరితం

12-08-2024 12:00:00 AM

స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువ’. భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా దర్శకుడు శివ రూపొందిస్తున్న ఈ సినిమాలో దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్ సోమవారం విడుదల కానుంది.

ఇప్పటిదాకా రిలీజ్ చేసిన సిజిల్ టీజర్, పోస్టర్స్, ఫైర్ సాంగ్ సినిమా మీద అంచనాలు పెంచాయి. తాజాగా ట్రైలర్ రిలీజ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ కూడా అత్యంత ఆసక్తి రేకెత్తిస్తోంది. పది భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.