- 10 నుంచి 17 వరకూ నామినేషన్ల స్వీకరణ
- 25న ఎన్నికలు.. అదే రోజు ఫలితం
- తెరపైకి బల్దియా రాజకీయ పార్టీల బలాబలాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): బల్దియాలో రాజకీయ పార్టీల మధ్య బలాబలాల వ్యవహారం మరోసారి తెరపైకి రానుంది. ఇటీవల బడ్జెట్ సమావేశాల రూపంలో తీవ్ర ఉత్కంఠత నెలకొనగా.. ఈ ఏడాదితో పాలక మండలి గడువు ముగియనున్న నేపథ్యంలో తాజాగా వెలువడిన స్టాండింగ్ కమిటీ ఎన్నిక నోటిఫికేషన్‌తో మరో 20 రోజుల పాటు బల్దియా రాజకీయాలు వేడెక్కనున్నాయి.
ఈ నెల 25న స్టాండింగ్ కమిటీ ఎన్నికకు కమిషనర్ ఇలంబర్తి మంగళరం నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తేదీ నుంచి 17వ తేదీ వ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా నా స్వీకరిస్తారు. 18న నామినేషన్లను స్క్రూట్నీ, 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ ఉంటుంది.
అదే రోజు కౌంటింగ్ నిర్వహించి, ఫలితాన్ని వెల్లడిస్తారు. ఈ ప్రక్రియ అంతా జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరుగుతుంది. మొ 15 మంది సభ్యుల ఎన్నికకు 2024 ఏడాది స్టాండింగ్ కమిటీ ఎన్నికలో ఎనిమిది మంది బీఆర్‌ఎస్, ఏడుగురు ఎంఐఎం కార్పొరేటర్లు ఎన్నికయ్యారు.
ఈ కమిటీలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు ఎవరూ ఎన్నిక కాలేదు. ఈసారి కమిటీలో సభ్యుల ఎంపిక మిశ్రమంగా ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. 15 మంది సభ్యులలో ఏఏ పార్టీల నుంచి ఎంతమంది ఎన్నికవుతారని బల్దియాలో హాట్ టాపిక్ అవుతుంది.
ఓటింగ్ తీరు
బల్దియా స్టాండింగ్ కమిటీ ఎన్నికలో ఎక్స్ అఫిషియో సభ్యులకు ఓటింగ్‌కు అవకాశం లేకపో ప్రస్తుతం 146 మంది సభ్యులు (4 స్థానాలు ఖాళీ) మాత్రమే కీలకం కానున్నారు. 2020 ఎన్నికల ప్ర బీఆర్‌ఎస్‌కు 56, కాంగ్రెస్‌కు 3, బీజేపీకి 47, ఎంఐఎంకు 44 స్థానాల్లో సభ్యులు ఉన్నారు. ఇటీవల జరిగిన పార్టీ ఫిరాయింపుల కారణంగా ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు 42, బీజేపీకి 39, కాంగ్రెస్‌కు 24 , ఎంఐఎంకు 41 మంది సభ్యులు ఉన్నారు.
స్టాండింగ్ క కేవలం 15 మంది సభ్యులను ఎన్నుకోవడానికి మాత్రమే ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఒక్కో సభ్యుడు 15 మంది సభ్యులకు ఓట్ చేయాల్సి ఉంటుంది. వీరిలో ప్రాధాన్యత పరంగా ఎవరికి అత్యధిక ఓట్లు నమోదు అయితే.. వారు సభ్యులుగా ఎన్నికైనట్టుగా ప్రకటిస్తారు. 15 మంది కంటే ఎక్కువ మంది పోటీ చేస్తే మొదటి 15 మందిని మాత్రమే ఎన్నికైనట్టుగా ప్రకటిస్తారు.
గతేడాది బీఆర్‌ఎస్, ఎంఐఎం కలిసి ఉన్నందున 8 చొప్పున సభ్యులు ఎంపికయ్యారు. ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో 15 మందిలో ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయో ఆసక్తిగా మారనుంది. కాంగ్రెస్, ఎంఐఎంలు కలిసే అవకాశాలు స్పష్టంగా కన్ప్తిస్తుండగా, మిగతా పార్టీల ఎత్తుగడలు ఎలా ఉంటాయో చూడాలి.