శేరిలింగంపల్లి, జనవరి 24 (విజయక్రాంతి): కొన్నాళ్లుగా గచ్చిబౌలి డివిజన్ హుడా లేఔట్ కాలనీ రాక్ గార్డెన్ 100 ఫీట్ల రహదారిలో సరైన స్ట్రీట్ లైట్స్ లేని కారణంగా ప్రజలకు ఏర్పడిన ఇబ్బం దులు తొలగిపోవడంపై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. హుడా కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ,జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ఆదేశాలతో రాక్ గార్డెన్ 100 ఫీట్ రోడ్ లో జిహెచ్‌ఎంసి ఎలక్ట్రికల్ డీఈ కవిత,ఏఈ లిఖిత, సిబ్బందితో శుక్రవారం కొత్తగా స్ట్రీట్ లైట్స్ వేయించారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి నల్లగండ్ల హుడా కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు.