calender_icon.png 4 April, 2025 | 4:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిచ్కుంద మున్సిపాలిటీ ఏర్పాటు పట్ల హర్షం

25-03-2025 12:00:00 AM

టపాకాయలు కాల్చిన కాంగ్రెస్ నాయకులు

కామారెడ్డి, మార్చి 24 (విజయక్రాంతి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లో మొట్టమొదటిగా బిచ్కుంద మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడం పట్ల కాంగ్రెస్ నాయకులు హర్షణ వ్యక్తం చేశారు. టపాకాయలు కాల్చి స్వీట్లు పంచారు.

ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న బిచ్కుందను మునిసిపాలిగా మార్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు స్థానిక కాంగ్రెస్ నాయకులు బిచ్కుంద ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిచ్కుంద యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు ధర్పల్లి గంగాధర్, శాఖపూర్ తుకారాం శోభన్, తక్కడపల్లి హనుమంత రావు పటేల్, నౌషా నాయక్, బిచ్కుంద గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.