- పల్లెల్లో ఆశావాహుల్లో నెలకొన్న ఎదురుచూపులు
- ఇప్పుటికే మద్దతుదారులను కూడగట్టుకుంటున్న వైనం
- గుర్తులను ప్రకటించిన ప్రభుత్వం
- జిల్లాలో 260 సర్పంచ్, 2268 వార్డు సభ్యుల స్థానాలు
- మూడు విడుతల్లో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం
సిరిసిల్ల, జనవరి 16 (విజయక్రాంతి): పల్లెల్లో సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ పై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆశావాహు లు ఎనికల్లో గెలుపొందేకు మద్దతుదారు లను కూడగట్టుకుంటున్నారు. ఎప్పుడు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన పోటీలో నిలిచేందుకు సన్నద్ధంగా ఉన్నారు. కానీ రిజర్వేషన్లు ఏది వస్తుందోనని భయం మా త్రం వారిని వెంటాడుతోంది.
ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల గుర్తులను ప్రభుత్వం ప్రకటించిగా, కేవలం రిజర్వేషన్లు ప్రకటించ డం మాత్రమే మిగిలిపోయింది. గత ప్రభు త్వం మాత్రం పదేళ్ల పాటు రిజర్వేషన్ తయా రు చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే కులగణన చేపట్టడుతో రిజర్వేషన్లు తారుమారు అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
దీంతో గ్రామా ల్లో రిజర్వేషన్లపై ప్రతి రోజు చర్చసాగు తోంది. కొందరైతే రిజర్వేషన్తో పని లేకుండా జనరల్ వస్తే చాలు పోటీలోఉంటామంటూ ప్రచారానికి తెరలేపారు. ఇప్పటికే స్థానిక సంస్థల్లో సత్తా చాటాలనే సంకల్పంతో అధి కార పార్టీ కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 మండలా లు, 260 గ్రామ పంచాయతీలుండగా, అందులో 260 సర్పంచ్ స్థానాలు, 2268 గ్రామ వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీల పరిధిలో 3 లక్షల 46 వేల 259 ఓటర్లు ఉండగా, అందులో మహిళలు 1,78,553, పురుషులు 1,67, 686 ఉన్నారు.
20 మంది జెండర్లు ఉన్నా రు. గత యేడాది ఫిబ్రవరి మాసంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం పదవికాలం ముగి యడంతో, ప్రభుత్వం ప్రత్యేక పాలనను తీసుకోచ్చింది. ఇప్పటికే కులగణన పూర్తి చేసుకోని, ఫిబ్రవరి చివరి మాసంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
స్థానాలకు గుర్తులివే..
రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నిక లకు ప్రభుత్వం గుర్తులను ప్రకటించింది. సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు సభ్యుల అభ్యర్థులకు 20 గుర్తులను కేటాయించింది. సర్పంచ్ల సంబంధించి, గులాబీ రంగు బ్యాలెట్ పత్రం, వార్డు సభ్యులకు తెల్ల రంగు బ్యాలెట్ పత్రం ఏర్పాటు చేశారు.
సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులు ఫుట్ బాల్, బ్యాట్స్మెన్, బ్యాట్, ఉంగరం, కత్తెర, స్టంప్స్, లేడీస్ పర్స్, టీవీ రిమోట్, చెత్తడబ్బా, బెండకాయ, కొబ్బరి చెట్టు, టూత్ పేస్ట్, పాన్, వజ్రం, నల్లబోర్డు, బకెట్, డోర్ హ్యాండిల్, బిస్కెట్, పిల్లణ గ్రావీ, చేతి కర్ర, మంచం, జల్లెడ, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, చైన్, పడవ, చెప్పులు, గాలిబుడగలను కేటాయిం చారు.
వారు సభ్యుల గురులు షటిల్, కరెం ట్ సంభం, సూల్, బీరువా, గ్యాస్ సిలెండర్, గౌన్, ఈల, కుండ, గరాట, ముకుడు, డిష్ ఏంటినా, ఐస్ క్రీమ్, గాజు, గ్లాస్, పోస్ట్ డ బ్బా, కవర్, కటింగ్ ప్లేయర్, హాకీ, కర్రబంతి, నైక్ టైలను కేటాయించారు.
రిజర్వేషన్ల కోసం ఎదురుచూపులు..
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావా హులు రిజర్వేషన్ల కేటాయింపుల కోసం ఎదురుచూస్తున్నారు. తమ ఊరిలో ఏ రిజ ర్వేషన్ వస్తుందోనని నిత్యం అంచనాలు వేసుకుంటున్నారు. గతంలో మాదిరిగా ఫలానా రిజర్వేషన్ వస్తుందనీ ధీమా ఉండ గా, ప్రస్తుతం కులగణన చేపట్టడంతో ఏ రిజర్వేషన్ వస్తుందోనని అంచనా వేయలేని పరిస్థితి అభ్యర్థుల్లో నెలకొంది. పల్లెల్లో నలుగురి కలిసిన చోట ఊరికి ఏరిజర్వేషన్ వస్తదో, రిజర్వేషన్ వస్తే ఎవరేవరూ బరిలో నిలుస్తారనే సమాలోచనలు చేస్తున్నారు.
260 సర్పంచ్, 2268 వార్డు సభ్యులు..
జిల్లాలో 260 సర్పంచ్లు, 2268 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేం దుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నా రు. జిల్లాలో 2268 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 65 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అంతకు మించి ఓటర్లు ఉంటే మరో పోలిం గ్ కేంద్రం ఏర్పాటు చేస్తారు.
200 మంది ఓటర్లు ఉన్న చోట ఒక ప్రీసైడింగ్ ఆఫీసర్, ఒక పోలింగ్ ఆఫీసర్ను నియమిస్తారు. 201 నుంచి 400 వరకు ఒక ఫ్రీసైడింగ్ ఆఫీసర్, ఇద్దరు పోలింగ్ ఆఫీసర్లు, 401 నుంచి 650 వరకు ఓటర్లు ఉంటే ఫ్రీసైడింగ్ ఆఫీసర్ ఆటు ముగ్గురు ‘పోలింగ్ ఆఫీసర్ల ను నియమిస్తారు. అయితే జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళ ఓట్లు కీలంగా మారనున్నాయి.
చివరి ఓటరు జాబితా ప్రకారం 3,46,259 మంది ఓట్లు ఉండగా, అందులో మహిళలు 1,78,553, పురుషులు 1,67,686 మంది ఉండగా, పురుషుల కంటే మహిళ ఓట్లు 10,867 ఓట్లు అధికంగా ఉన్నాయి.
ఎన్నికలపై ప్రధాన పార్టీల దృష్టి
స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్య ర్థులు గెలుపొందేలా ప్రధాన పార్టీలు ప్రత్యే కంగా దష్టి సారించాయి. ఇప్పటికే జిల్లాలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజ వర్గం ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డిలు కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు నిర్వహించి, ఎన్నికల్లో గెలుపుకు ప్రతి ఒక్క రూ కషి చేయాలని దిశానిర్ధేశం చేశారు.
అదేవిధంగా బీఆర్‌ఎస్ రాష్ర్ట నేత కేటీఆర్ ఇప్పటికే జిల్లాలో ప్రధాన నాయకులతో సమావేశం నిర్వహించి, ఎన్నికల్లో సత్తా చా టేలా పని చేయాలని సూచించారు. అదేవి ధంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజ య్ సైతం జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించి, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని ఆదేశించా రు.
ఇప్పటికే మండలాల నూతన అధ్యక్షులు నియమించి, వారి సారథ్యంలో పల్లెలో సర్పంచ్లు, ఉపర్పంచ్ పదవులు దక్కించు నేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఏది ఏమైనా సర్పంచ్ల ఎన్నిక రిజర్వేషన్ల కోసం పల్లెల్లో ఉత్కంఠగా అందురూ ఎదురుచూస్తున్నారు.