16-02-2025 12:00:00 AM
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముమ్మర ప్రచారం
హైదరాబాద్, ఫిబ్రవరి15 (విజయక్రాంతి): ఢిల్లీ విజయం తెలంగాణ బీజేపీ నేతల్లో కొత్త ఉత్సహాన్ని నింపింది. దానికి తోడు ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే బీజేపీకి బంపర్ మెజార్టీ వస్తుందని పలు సర్వేల్లో తెలపడంతో కమలనాథులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలుపు నల్లేరు మీద నడకే భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఖాతా కూడా తెరవకపోవడంతో ఆ ప్రభావం ఎమ్మెల్సీ ఎన్నికలపై పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్, నల్గొండ స్థానాలకు సంబంధించిన బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు మల్క కొమరయ్య, సరోత్తం రెడ్డి...
కరీంనగర్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా రాష్ట్రానికి చెందిన పార్టీ అగ్రనేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఇంచార్జి సునీల్ భన్సల్ తమ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.