26-02-2025 04:36:30 PM
దర్గాలో గంధాలు సమర్పించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ...
సంగారెడ్డి (విజయక్రాంతి): వెంకట ఖ్వాజా షరీఫ్ దర్గాలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గంధం సమర్పించారు. బుధవారం సంగారెడ్డి జిల్లాలోని వట్టిపల్లి మండల కేంద్రంలో ఉన్న వెంకట ఖ్వాజా షరీఫ్ దర్గాలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గంధం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దర్గాలో ప్రత్యేక జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. జాతర ఉత్సవాలలో మంత్రితో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు.