- అభ్యంతరకర వ్యాఖ్యలపై క్షమాపణలు
- రికార్డుల నుంచి తొలగింపు
హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో అభ్యంతర వ్యాఖ్య లతో వివాదాల్లో నిలిచారు. శుక్రవారం హైదరాబాద్‌కు సంబంధించిన అంశం పై మాట్లాడుతుండగా... బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆటంకం కలిగించారు. దీంతో ఆగ్రహావేశాలకు గురైన దానం... వారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘మీరు ఇలాగే ప్రవర్తిస్తే హైదరాబాద్‌లో తిరగనియ్య కొడకల్లారా.. తోలు తీస్తా’ అంటూ తీవ్రంగా స్పందించారు. ‘నాటకాలు ఆడుతున్నారా’... అంటూ ఆవేశంగా మాట్లాడారు.
దానం వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తంచేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభలో ఆందోళన చేశారు. ఇది సరైన సంప్రదా యం కాదని, దానం వెంటనే క్షమాపణ చెప్పాలని మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. వారే తనను కవ్వించారని, అయినా నా పరిధిలోనే మాట్లాడా నని, తన మాటలు సభ్యులకు బాధ కలి గించి ఉంటే విచారం వ్యక్తంచేస్తున్నట్లు తెలిపారు. సభలో చీఫ్ మినిస్టర్‌ను చీప్ మినిస్టర్ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యానించడం తనకు బాధ కలిగించిం దని అన్నారు. దానం అభ్యంతరకర వ్యాఖ్యలను స్పీకర్ తొలగించారు.