26-03-2025 01:21:18 AM
ఆల్ఫోర్స్ వార్షి సంబురాలు
కరీంనగర్, మార్చి 25 (విజయ క్రాంతి): నగరంలోని కిసాన్ నగర్ లో ప్రవేట్ మందిరంలో ‘బ్లాసూమ్‘ పేరుతో నిర్వహించినటువంటి అల్ఫోర్స్ హై స్కూల్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ఉత్సాహంగా సాగాయి. ముఖ్య అతిథిగా హాజరైన అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి సరస్వతి మాత విగ్రహానికి పూలమాలవేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సామాజిక అవగాహనతో పాటు నైతిక విలువల పట్ల అవగాహన పెంపొందించాలని తద్వారా సమాజంలో సముచిత స్థానాన్ని పొందుతారని అన్నారు.
వేడుకలలో భాగంగా ఫలు పోటీ పరీక్షలలో నిలిచినటువంటి అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులు ప్రద్శించినటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు ఆలోచింపచేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.