calender_icon.png 26 February, 2025 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ ఎస్సై, కానిస్టేబుల్

26-02-2025 12:43:47 AM

భైంసా, ఫిబ్రవరి 25: లంచం తీసుకుం టూ భైంసా ఎక్సైజ్ ఎస్సై, కానిస్టేబుల్ మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డారు. నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని కామోల్ గ్రామానికి చెందిన సుభాష్‌గౌడ్ అనే కల్లు వ్యాపారికి అదే గ్రామానికి చెందిన మరో కల్లు వ్యాపారికి కల్లు విక్రయాలపై గొడవ తలెత్తింది.

సమస్య పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. సమస్యను పరిష్కరించాలని సుభాష్‌గౌడ్ భైంసా ఎక్సైజ్ ఎస్సై నిర్మలను సంప్రదించాడు. ఆమె కానిస్టేబుల్ సుజాత ద్వారా రూ.10 వేలు డిమాండ్ చేసింది. దీంతో సుభాష్‌గౌడ్ ఏసీబీని ఆశ్రయించి, వారి సూచన మేరకు మంగళవారం రాత్రి కానిస్టేబుల్ సుజాతకు లంచం ఇస్తుండగా పట్టుకున్నారు.