calender_icon.png 18 January, 2025 | 5:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓయో రూమ్‌ కేంద్రంగా గంజాయి సరఫరా

18-01-2025 01:54:15 PM

ఎక్సైజ్ ఎస్టిఎఫ్ పోలీసుల దాడి..

నిందితుల వద్ద నుండి 3.625 కిలోల గంజాయి స్వాధీనం...

శేరిలింగంపల్లి (విజయక్రాంతి): ఓయో రూమ్‌ కేంద్రంగా గంజాయి విక్రయాలు జరుపుతున్న ఇద్దరిని ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు(Excise STF Police) అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే ఏపీ లోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన రాజు (25), మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంజన (18) స్నేహితులు, కాగా వీరు ఇరువురు వేరువేరుగా గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తుండేవారు. ఈ నేపథ్యంలో సంజన, రాజులు ఇద్దరూ కలిసి గంజాయి విక్రయించేందుకు పథకం పన్నారు. అందులో భాగంగా గచ్చిబౌలి పోలీసు స్టేషన్(Gachibowli Police Station) పరిధిలోని కొండాపూర్ లో గల ఓయో రూమ్ బుక్ చేసుకుని గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తూ వస్తున్నారు. ఈ మేరకు పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం రాత్రి కొండాపూర్ లోని ఓయో రూమ్ పై దాడి చేసి రాజు, సంజనలను అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నం జిల్లా అరుకు వివిధ ప్రాంతాల నుండి గంజాయి తీసుకొచ్చి ఓయో రూమ్ లో ఉంటూ విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుండి 3.625 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ఎన్ డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.