calender_icon.png 10 January, 2025 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బర్త్‌డే పార్టీపై ఎక్సైజ్ దాడులు

01-08-2024 08:30:00 AM

  1. వేడుకలకు బుల్లితెర నటులు హాజరైనట్లు గుర్తింపు 
  2. అనుమతి లేకుండా మద్యం వినియోగం 
  3. ఇద్దరిపై కేసు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 31 (విజయక్రాంతి): ఘట్‌కేసర్ పరిధి అంకుషా పూర్‌లోనిది కాంటినెంటల్ రిసార్ట్‌లో బిగ్‌బాస్ ఫేమ్ మహబూబ్ షేక్ బర్త్‌డే పార్టీ నిర్వహిస్తుండగా.. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం సభ్యులు ఆకస్మిక దాడులు నిర్వహించిన విషయం బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తన బర్త్‌డే సందర్భంగా ది కాంటినెంటల్ రిసార్ట్‌లో ఈ నెల 29న మహబూబ్ షేక్ వేడుకలను నిర్వహించాడు. ఈ వేడుకలకు 20 మందికి పైగా బుల్లితెర నటులు, ప్రముఖులు హాజరయ్యారు.

అయితే, వేడుకల్లో మద్యం విని యోగించడం కోసం నిర్వాహకులు ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఈ విషయం తెలిసి ఎక్సైజ్ పోలీసులు రిసార్ట్‌పై దాడులు నిర్వహించి అనుమతి లేకుండా వినియోగిస్తున్న 10 లీటర్ల మద్యా న్ని, 5 లీటర్ల బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బర్త్‌డే పార్టీ నిర్వాహకుడు షేక్ సుభానీ, రిసార్ట్ యజమాని సుధీర్‌పై  కేసు లు నమోదు చేశారు. పార్టీలు నిర్వహించుకోవడానికి ఎక్సైజ్ శాఖ అనుమతులు తీసుకో వాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ అనుమతించిన మద్యాన్ని మాత్రమే వినియోగించాలని పేర్కొన్నారు.