calender_icon.png 26 December, 2024 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరిహద్దు గ్రామాల్లో ఎక్సైజ్ దాడులు

25-12-2024 02:03:56 AM

* 18,500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

భద్రాచలం, డిసెంబర్ 24: ఉమ్మడి ఖ మ్మం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ జీ గణేష్ ఆధ్వర్యంలో మంగళవారం భద్రాచలం సమీపంలోని ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో రెండు రాష్ట్రాల సిబ్బంది దాడులు నిర్వహించారు. ఎటపాక మండలం పిచ్చుకలపాడు, గుండావారిగూడెం గ్రామాల్లో దాడులు చేసి 180 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నారు. నాటు సారా తయారీకి ఉపయో గించే 18,500 లీటర్ల బెల్లం పానకం ధ్వం సం చేశారు.

ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు మాట్లాడుతూ.. నాటు సారా తయారీ చేసి నా, అమ్మినా, రవాణా చేసినా కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడు ల్లో తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు గణే ష్, కరంచంద్, మున్సీసాబేగం, రమేష్, శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ అధికారులు మధు, నాగ రాహూల్, శ్రీనివాస్, ఇంద్రజిత్ పాల్గొన్నారు.