calender_icon.png 23 December, 2024 | 11:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండుచోట్ల ఎక్సైజ్ దాడులు

08-10-2024 12:46:32 AM

నలుగురి అరెస్ట్.. మరో ఏడుగురిపై కేసు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 7 (విజయక్రాంతి): ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ అధి కారులు ధూల్‌పేట్ లో  రెండుచోట్ల నిర్వహించిన దాడు ల్లో 24.4 కిలోల గంజాయి పట్టుబడింది. వివరాలిలా ఉన్నాయి.. ధూల్ పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జలి హనిమాన్ స్టేడియం వద్ద లోది కిశోర్‌సింగ్, జ్యోతిబాయి అనే  వ్యక్తు ల ఇంట్లో విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం ఎక్సైజ్ పోలీసు లు తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో వారి ఇళ్లలో నిల్వ ఉంచిన గం జాయిని స్వాధీనం చేసుకున్నారు. కిశోర్‌సింగ్, జ్యోతిబాయిని అరెస్ట్ చేశారు. వారితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. అదే విధంగా జియాగూడ వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఇద్దరు వ్యక్తులు యాక్టి వాపై తరలిస్తున్న 1.56 కిలోల గంజాయిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికా రులు స్వాధీనం చేసుకున్నారు. అభిషే క్ సింగ్, శుభమ్‌సింగ్ అనే యువకులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.