అనుమతి లేని మద్యం పట్టివేత
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 4 (విజయక్రాంతి): గోల్కొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హుమాయన్‌నగర్‌తో పాటు చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్, అనుమతి లేని మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం గో ల్కొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హుమాయిన్‌నగర్ మౌంట్ బసేరా అపార్ట్‌మెంట్‌లో డిఫెన్స్ మద్యాన్ని అమ్ముతున్న పలువురు వ్యక్తులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెం ట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వారి నుంచి 15మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎన్.బాలాజీ, మహమ్మ ద్ ఉస్మాన్ అలీ, తులసీరాంను అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ మహేష్, ఎస్‌ఐ వరద భూ పాల్ తెలిపారు. చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొయినాబాద్‌లోని జీఎంఎస్ ఫామ్ హౌజ్‌లో ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా మద్యాన్ని వినియోగించారు. సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సుభాష్ సిబ్బందితో కలిసి ఆదివారం దాడులు నిర్వహించి 1.25లీటర్ల లిక్కర్, 7.15 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫామ్‌హౌజ్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.