calender_icon.png 20 September, 2024 | 6:05 PM

అంతర్ పండుగ గంజాయి మొక్కల సాగు..

20-09-2024 04:06:13 PM

రెండు లక్షల విలువైన గంజాయి మొక్కలను ధ్వంసం చేసిన ఎక్సైజ్ పోలీసులు 

సంగారెడ్డి,(విజయక్రాంతి): అక్రమంగా వ్యవసాయ పొలంలో అంతర్ పంటగా గంజాయి మొక్కలు సాగు చేస్తున్నారని నమ్మదగ సమాచారం రావడంతో దాడి చేసి మొక్కలు ధ్వంసం చేశామని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని వట్టిపల్లి మండలం మరువెల్లి గ్రామంలో జుట్టు నర్సింలు అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నారని సమాచారం రావడంతో దాడులు చేసి మొక్కలు ధ్వంసం చేసామన్నారు.

మరువెల్లి గ్రామంలోని సర్వే నంబర్ 125/u2 లో ఉన్న వ్యవసాయ భూమిలో అంతర్ పంటగా 20 గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్టు గుర్తించామన్నారు. పట్టుబడిన గంజాయి మొక్కల విలువ సుమారు రెండు లక్షలు ఉంటుందన్నారు. అంతర్ పండుగ గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి పోలీస్స్టేషన్ తరలించామన్నారు. ఈ దాడుల్లో మెదక్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ వీనారెడ్డి, ఎస్సై అనిల్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ విట్టల్ ,అనిల్ కుమార్, మల్కయ్య, ప్రలాదిరెడ్డి లో పాల్గొన్నారు.