calender_icon.png 26 December, 2024 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిటీలో ఎక్సైజ్ పోలీసుల దూకుడు

25-12-2024 12:44:42 AM

వేర్వేరు ఘటనల్లో 96 మద్యం బాటిళ్ల పట్టివేత

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 24 (విజయక్రాంతి): నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి మద్యం దిగుమతి చేస్తున్న వారిపై ఎక్సైజ్ శాఖ కొరడా ఝుళిపిస్తోంది. తాజాగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలులో మద్యం సరఫరా అవుతుందనే సమాచారం మేరకు మంగళవారం సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన దాడిలో మెట్టు సందీప్ అనే వ్యక్తిని వద్ద ఇతర రాష్ట్రాల తీసుకువచ్చిన రూ. 2.50 లక్షల విలువైన 76 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

మరో ఘటనలో ఎక్స్ సర్వీస్‌మెన్ బాలకృష్ణ యాప్రాల్ ప్రాంతంలోని ఎంప్లాయిస్ కాలనీలో కిరాణ దుకాణం నడిపిస్తున్నాడు. అయితే ఎక్స్ సర్వీస్‌మెన్‌గా తనకు వచ్చే మద్యం బాటిళ్లతో పాటు ఇతరుల వద్ద కొనుగోలు చేసి ఎక్కువ ధరకు తన కిరాణ దుకాణంలో వాటిని విక్రయిస్తున్నాడు.

ఎస్‌టీఎఫ్ దుకాణంపై దాడులు నిర్వహించి బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 20 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.