calender_icon.png 24 January, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు

23-01-2025 11:31:23 PM

చింతలమానేపల్లి (విజయక్రాంతి): మండలంలోని లంబడిహెట్టి, రణవెల్లి గ్రామాలో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. దాడుల్లో లభ్యమైన 60 లీటర్ల  నాటుసార, గుడుంబా తయారీకి వాడే ముప్పై కిలోల బెల్లం, పది కిలోల పటికను స్వాధీనపరచుకుని కేసు నమోదు చేశారు. 4వేల లీటర్ల బెళ్ళం పానకం ధ్వంసం చేశారు. నాటు సారాయి, గంజాయి లాంటి మత్తు పదార్ధాల వలన కలిగె దృష్ప్రభావాల గురించి అవగాహన కల్పించారు. ఎనిమిది మంది నిందితులను చింతలమానేపల్లి తహశీల్దార్ మునావర్ షరీఫ్ ముందు బైండోవర్ చేసినట్టు కాగజ్ నగర్ ఎక్సైజ్ సిఐ వి. రవి తెలిపారు. ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్సైలు పి.లోభానంద్, ఐ.సురేష్, పి.రాజేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.