calender_icon.png 14 March, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయిపై ఉక్కు పాదం..

11-03-2025 08:54:12 PM

ఎక్సైజ్ కార్యాలయం తనిఖీ.. 

ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి..

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): గంజాయి సాగు చేయకుండా, రవాణా కాకుండా ఉక్కు పాదం మోపాలని ఎక్సైజ్ శాఖ సిబ్బందికి నిజాంబాద్ ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి సూచించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎక్సైజ్ కార్యాలయాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటి కమిషనర్ వి. సోమిరెడ్డి తనిఖీ చేశారు. కార్యాలయం రికార్డులను ఆయన క్షుణంగా పరిశీలించారు. 2006 నుంచి ఇప్పటి వరకు నమోదైన కేసులను, రికార్డులను తనిఖీ చేసి అన్ని సక్రమంగా ఉండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

మత్తు పదార్థాల రవాణా, గంజాయి పట్ల ఉక్కు పాదం మోపాలని స్థానిక ఎక్సైజ్ సిబ్బందికి సూచించారు. గుడుంబా నిలువలు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో తమ విధులు నిర్వహించాలని డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలపై కఠిన చర్యలు యువకులు మత్తుమందులకు దూరంగా ఉండే విధంగా చైతన్యం తేవాలన్నారు. ఆయన వెంట స్థానిక ఎక్సైజ్ సీఐ ఎండి.షాఖీర్ అహ్మద్, ఎస్ఐ జగన్ మోహన్, హెడ్ కానిస్టేబుల్ పెంటయ్య, జూనియర్ అసిస్టెంట్ లు జనార్ధన్, ఆనంద్, సిబ్బంది తదితరులు ఉన్నారు.