* -ఆఫీసుకు ఎప్పుడు వస్తాడో రాడో ఎవరికీ తెలియదు
* అడిగితే సెలవులో అంటారు విధుల్లో ఎప్పుడు?
*-ఒక వేళ వస్తే వసూలు కావాల్సిందే
* -సమాచారం నిమిత్తం ఫోన్ చేసినా స్పందించని అధికారి
నారాయణపేట, జనవరి 15(విజయ క్రాంతి): నారాయణపేట జిల్లా ఆబ్కారీ శాఖ సి ఐ రూటే సపరేటు. వివరాల్లోకి వెళితే నారాయణపేట జిల్లా ఏర్పడి ఆరు సంవత్స రాలు అవుతోంది కానీ ఉమ్మడి జిల్లా నుండీ అన్ని విభాగాల శాఖలు విభజన అయ్యాయి కానీ నేటికీ ఆబ్కారీశాఖ మాత్రం ఎలాంటి విభజన కాలేదు.
నారాయణపేట జిల్లాలో అభ్కారి శాఖకు సిఐనే జిల్లా బాస్‌గా కొనసా గుతున్నారు. ఇదే జిల్లాలో రెండు సర్కిళ్ల పరిధి కోస్గి,నారాయణపేట సర్కిళ్ళుగా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో ఉన్న వలయాధికారే జిల్లా అధికారిగా కొనసాగు తున్నట్లు ఉంది.
జిల్లాకు కర్నాటక సరిహ ద్దు ప్రాంతంలో ఉండటంతో కర్నాటక రా ష్ర్టంలో ఆ రాష్ర్ట ప్రభుత్వం కల్లుపై నిషేధం విధించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న సరి హద్దు గ్రామాల్లో కల్లు విపరీతంగా అమ్మ కాలు సాగుతున్న నేపథ్యంలో అధికారులు మాత్రం మామూల్లకు ఆశపడి నారాయణ పేట జిల్లా కేంద్రంగా పనిచేయటానికి ఉత్సా హం చూపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇక్కడి అధికారికి మామూల్లు నెలకు లక్షల్లో ముట్ట చెప్పుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. కల్లు వ్యాపారం జిల్లాలో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతుంది. ఈత చెట్లు పేరుకు మాత్రం కొన్ని ఉన్నా కల్లు వ్యాపా రం మాత్రం సీ హెచ్, డైజోఫాం అనే డ్రగ్స్ తో తయారు చేసిన మత్తు పదార్థం కలిపి వ్యాపారం కొనసాగిస్తున్నారు.
దీంట్లో భా గంగానే మరికల్ కేంద్రంగా ఇటీవలి కాలం లో అనగా దసరా పండుగ (విజయదశమి) నుండి దన్వాడ, మరికల్, లింగం పల్లి, కొల్లం పల్లి, చిన్నజేట్రం, అంతారం, జాజాపూర్, ఆపక్ పల్లి మందిపల్లి, తీలేర్, మొత్తం పది గ్రామాలు కలిపి హైదారాబాద్ నుండి ఓ బడా వ్యాపారవేత్త కల్లు వ్యాపారం కొనసాగి స్తున్నారు. ఈయన మాత్రం సిఐ కనుసన్న ల్లో వ్యాపారం కొనసాగిస్తున్నారనీ ఆరోపణ లు సైతం ఉన్నాయి.
అలాగే కల్లు వ్యాపారం ద్వారా అధికారికి నెలకు లక్షల్లో ప్రతీ గ్రామా ల్లో ఉన్న కల్లు వ్యాపారం చేసే నిర్వాహకులు నెలకు అయిదు వేల చొప్పున నారాయణ పేట సర్కిల్ నుండి లక్షల రూపాయల మామూలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణ లు ఉన్నాయి. అలాగే సర్కిల్ కు సుమారు 22 వైన్స్ షాపులు ఉన్నాయి.
ఒక్కొక్క షాపు కు అబ్కారీ అధికారులను బట్టి ఒక్కో అధికారికి ఒక్కోరేటు అన్న చందంగా మా మూల్లు తీసుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి . నెలసరి వసూళ్లకు గాను మక్తల్ కేంంద్రానికి ధన్వాడ, కేంద్రానికి, నారాయణ పేట జిల్లా కేంద్రానికి సంబంధించి ముగ్గురు సిబ్బందితో కలిసి కల్లు, వైన్స్ షాపులు ద్వారా వసూలు చేసిన సొమ్మును అందరూ బాగ పరిష్కారం చేసుకుంటున్నట్లు తెలు స్తోంది.
ఇదే అధికారినీ ఓ ప్రజా ప్రతినిధి వ్యక్తిగత సహాయకుడు ఫోన్ లొ సంప్రదిం చగా దురుసుగా ప్రవర్తించారని ఈ శాఖ జిల్లా అధికారి గా భావించే నన్నే బేధిరిస్తావా అని పోలీసులను ఆశ్రయించారనీ సమా చారం. దీన్ని సదరు పోలీసు అధికారి ప్రజా ప్రతినిధి దష్టికి తీసుకువచ్చారనీ అలాంటి వ్యక్తి గత సహాయకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండాలని చెప్పినట్లు తెలు స్తోంది.
దీంట్లో భాగంగానే సదరు ముగ్గురు శాఖాధికారుల ను విజయ క్రాంతి ప్రతినిధి వారి దష్టికిమాముల్లవిషయం తీసుకెళ్తే మాకే మీ తెలియదని మీరేమైనా రాసుకోవచ్చని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఇప్పటి కైనా అబ్కారీ శాఖాధికారి పై సంబధిత జిల్లా కలెక్టర్, అభ్కారీ శాఖ సూపరింటెండెంట్, డిప్యూటీ కమిషనర్‌లు చర్యలు తీసుకోవా లని పలువురు కోరుతున్నారు.