calender_icon.png 23 February, 2025 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాటుసారాపై ఎక్సైజ్ శాఖ నజర్

19-02-2025 12:41:44 AM

లక్షలాది లీటర్ల గుడుంబా స్వాధీనం

హైదరాబాద్, ఫిబ్రవరి 18(విజయక్రాంతి): రాష్ట్రంలో  నాటుసారాను పూర్తిగా నిర్మూలించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఎక్సైజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 మధ్య దాడులు చేసి, లక్షలాది లీటర్ల  సారా, క్వింటాళ్ల కొద్ది బెల్లంతో పాటు సారా తయారీకి ఉపయోగిస్తున్న మత్తు పదార్థాలు సీజ్ చేశారు.

నాటుసారను అరికట్టడానికి  ఎక్సైజ్ శాఖ చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం మంచి ఫలితాన్ని ఇచ్చిందని ఎక్సైజ్‌శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలా  తెలిపారు. ౨౦౨౩లో 20,803 కేసులు నమోదుకాగా 1,30,696 లీటర్ల సారా, 6,47,940 కిలోల బెల్లం, 1,807 వాహనాలు పట్టుకున్నారు. 11,713 మందిని అరెస్టు చేశారు. రూ. 1.53 కోట్ల జరిమానా విధించారు.

2024లో 2,241 కేసులు నమోదుకాగా  1,10, 529 లీటర్ల సారా, 5,82,031 కిలోల బెల్లం, 2,368 వాహనాలు పట్టుకున్నారు. 13,747 మందిని అరెస్టు చేశారు. రూ. 1.53 కోట్ల జరిమానా విధించారు. 2025లో ఇప్పటి వరకు 1,771 కేసులు నమోదుకాగా  1,10,660 లీటర్ల సారా, 8,718 కిలోల బెల్లం, 295 వాహనాలు పట్టుకున్నారు. 1,720 మందిని అరెస్టు చేశారు. రూ. 14.99 లక్షలు జరిమానా విధించారు.