calender_icon.png 27 October, 2024 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలు ఉల్లగించి రేవ్ పార్టీ.. పరారీలో రాజ్ పాకాల

27-10-2024 03:24:19 PM

హైదరాబాద్,(విజయక్రాంతి: నార్సింగి పోలీసులు స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ), ఎక్సైజ్‌ శాఖ అధికారుల సహకారంతో హైదరాబాద్‌ శివార్ల జన్వాడలో ఫామ్‌హౌస్‌పై ఆదివారం దాడులు నిర్వహించారు. జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో శనివారం రాత్రి పార్టీ జరిగింది. 21 మంది పురుషులు, 14 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వహకులు 35 మందితో మద్య పార్టీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ శ్రీలత మాట్లాడుతూ..  జన్వాడా ఫామ్ హౌస్ పార్టీ కేసులో విచారణ చేస్తున్నామన్నారు. ఏ1గా ఫామ్ హౌస్ సూపర్ వైజర్ కార్తిక్, ఏ2గా రాజ్ పాకాలను చేర్చినట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు. నిబంధనలు ఉల్లగించి పార్టీ నిర్వహించారన్నారు. కర్ణాటక లిక్కర్ తో పాటు ఏడు లీటర్ల విదేశీ మద్యం కూడా స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని సీఐ శ్రీలత వెల్లడించారు. రాజ్ పాకాల పరారీలో ఉన్నారని, అతని కోసం పోలీసులు గలిస్తున్నారన్నారు. విచారణలో మరికొన్ని విషయాలు వెలగులోకి వస్తాయని ఎక్సైజ్ సీఐ శ్రీలత చెప్పారు.

ఇదిలా ఉండగా..  ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. పరారీలో ఉన్న రాజ్ పాకాల రాయదుర్గం ఓరియన్ విల్లాస్ లోని విల్లా నెం.40లో నివాసం ఉంటున్నట్లు సమచారం రావడంతో అక్కడికి చేరుకున్నారు. రాజ్ కోసం వెతుకగా అతని విల్లాకు తాళం వేసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాజ్ తమ అదుపులో లేడాన్ని ఎక్సైజ్ జాయింట్ కమిషన్ పేర్కొంది. జన్వాడ ఫామ్ హౌస్ లో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు. పంచానామా తర్వాత మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.