calender_icon.png 25 November, 2024 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్సైజ్ సీఐ తీరు వివాదాస్పదం

25-11-2024 01:58:31 AM

తనిఖీల ఆర్డర్ అక్రమార్కులకు ఫార్వర్డ్!

నిజామాబాద్, నవంబర్ 24: అక్రమ మద్యం, కల్లు తయారీ, బెల్ట్ షాపులపై నిఘా పెట్టాల్సిన అధికారి తన పైఅధికారులు ఇచ్చిన సమాచారాన్ని సోషల్ మీడియాలో బహిర్గతం చేయడం నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. నిజామాబాద్ జిల్లా బోధన్ పరిధిలోని బెల్ట్ షాపులు, కల్లు డిపోలను తనిఖీ చేయాల్సిందిగా ఎక్సైజ్ సీఐ పవన్‌గౌడ్‌కు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు.

ఎక్కడ, ఏ సమయానికి దాడులు జరుగుతాయో తెలిపే ఆర్డర్ కాపీని ఎక్సైజ్ సీఐ పవన్‌గౌడ్ వాట్సాప్‌లో ఫార్వర్డ్  చేశా రు. ఈ విషయం బహిర్గతం కావడంతో ఎక్సైజ్ శాఖలో కలకలం మొదలైంది. శాఖపరమైన సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచాల్సిన అధికారే ఇలా చేయడం ఎక్సైజ్ శాఖ పనితీరుకు అద్దం పడుతోంది.

ఎక్సైజ్ శాఖ అధికారులకు అక్రమ మద్యం, కల్లు తయారీదారులు అధిక మొత్తంలో ముడుపులు ముట్టజెపుతున్నట్టు ఆరోపణలు న్నాయి. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో అధికారిని నియమించి అక్రమార్లుకు అండ గా ఉండేలా పై అధికారులే షాడో పాత్ర పోషిస్తున్నారని తెలుస్తున్నది. ఎక్సైజ్ సీఐ ఆర్డర్ కాపీని ఫార్వర్డ్ చేయడంతో అధికారులకు, అక్రమార్కులకు సహకరిస్తు న్నట్టు అనుమానాలు వ్యక్తమవతున్నాయి.