calender_icon.png 5 January, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు

04-01-2025 01:12:36 AM

ముగ్గురు మావోయిస్టులు హతం

న్యూఢిల్లీ, జనవరి 3: ఒడిశా సరిహద్దుల్లో తుపాకీ తూటా పేలింది. మావోయి స్టులకు, భద్రతా దళాలకు జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. 2 తేదీల మధ్య ఒడిశాలోని నుపాడా జిల్లా, ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లా సరిహద్దుల్లో ఒడిశా ఎస్‌ఓజీ బృందాలు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ దళాలు సంయుక్తం గా కూంబింగ్ నిర్వహించాయి.

అటాంగ్ అటవీ ప్రాంతం వద్ద  ఉదయం 11 గంటలకు భద్రతాదళాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు మావోయిస్ట్‌లపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మరణించిన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలతోపాటు ఆయుధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.