calender_icon.png 1 January, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ వైద్యునికి ఎక్సలెంట్ అవార్డు

02-12-2024 06:27:28 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న ప్రధాన వైద్యులు ఇట్టం రవీంద్ర మోహన్ సోమవారం హైదరాబాదులో ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. ఉత్తమ సేవలకు గాను కేట్రాఫ్ట్ ప్రొడక్షన్ ఎల్.ఎల్. పి వారిచే ఏషియన్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు రావడానికి కృషి చేసిన ఆస్పత్రి వైద్యులు నర్సింగ్ సిబ్బంది ఎల్లారెడ్డి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు రావడం పట్ల మరింత సేవ చేయాలని భావం పెరిగిందని వైద్యులు రవీంద్ర మోహన్ అన్నారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులను ఆస్పత్రి సిబ్బందిని సత్కరించారు.