22-04-2025 01:20:16 AM
నారాయణఖేడ్, ఏప్రిల్ 21: నారాయణఖేడ్ పట్టణంలోని పురాతనమైన కాశీనాథ్ మందిరంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన సంఘటన సోమవారం నాడు స్థానికంగా తీవ్రంగా కలకలం రేపింది. ఆలయంలోని స్థానిక మంటపం ప్రక్కన 10 మీటర్ల లోతును తవ్వకాలు జరిపిన ఆనవాళ్లను భక్తులు గుర్తించారు.
దీంతో విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పి.సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నగేష్ షెట్కార్ ల దృష్టికి తీసుకెళ్లగా వారు సంఘటన స్థలానికి చేరుకొని తవ్వకాలపై ఆరా తీయగా ఆలయ కమిటీ చైర్మన్ గా ఉన్న హనుమాన్లు గుప్తనిధుల తవ్వకా లకు ప్రయత్నాలు చేసినట్లు భక్తులు వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నాయకులు పోలీసులకు, ఎండోమెంట్ అధికారులకు సమాచారం అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయంలో ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదని ఆలయ చైర్మన్ ఆలయ అభివృద్ధికి కృషి చేయాల్సింది పోయి ఇలాంటి ఘటనలకు పాల్పడటం సరికాదని మందలించారు. కాగాసంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటనపై పూర్తిగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎమ్మెల్యే ఆదేశించారు.
వారి వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షట్కర్, వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, కాంగ్రెస్ నాయకులు కర్నే శ్రీనివాస్, నరేష్ యాదవ్, పండరి రెడ్డి, చామకూర పాండు, డిసిసి బ్యాంక్ కోపరేటివ్ చైర్మన్ అశోక్ రెడ్డి, మూడ రామకృష్ణ, వివేకానంద, ఆలయ పూజారి గురు పంతులు తదితరులుఉన్నారు.