calender_icon.png 30 September, 2024 | 9:08 PM

పాలేరు అలుగులో మట్టి తవ్వకాలు

30-09-2024 01:21:38 AM

నాయకన్‌గూడెం బ్రిడ్జికి పొంచి ఉన్న ప్రమాదం 

కూసుమంచి, సెప్టెంబర్ 29: ఇరిగేషన్ అ ధికారుల నిర్లక్ష్య వైఖరితో ఖమ్మం జిల్లా నా యకన్‌గూడెం బ్రిడ్జికి ప్రమాదం పొంచి ఉం దనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదల వల్ల పాలేరు ఎడమ కాల్వకు గండి పడిన సంగతి  తెలిసిందే. అయితే ఇరిగేషన్ అధికారులు ఈ గండిని పూడ్చేందుకు పాలేరు జలాశయం అ లుగు కింద భాగం ప్రాంతంలో పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు జరిపి, దానిని గండి పడిన ప్ర దేశానికి తరలించారు.

ఇక్కడ నుంచి భారీ ఎ త్తున మట్టిని తవ్వి గండిని పూడ్చటంతో పాలే రు అలుగు ప్రాంతంలోని నాయకన్‌గూడెం వద్ద సూర్యాపేట మార్గం లోని బ్రిడ్జికి ప్రమాదం పొంచి ఉందని తెలుస్తున్నది. మట్టి ని తరలించడం వల్ల రానున్న రోజుల్లో అధిక వర్షాలు కురిస్తే వరదలు సం భవించి సమీపం లోని బ్రిడ్జి దెబ్బతినే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు.

మట్టితో పాటు ఆ ప్రాంత ంలో ఉన్న పెద్ద పెద్ద రాళ్లను కూడా తరలించారు. అధికారులు ముందు చూపు లేకుండా ఈ విధంగా అలుగు ప్రాంతంలో మట్టిని తవ్వి తరలించడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మట్టి తవ్విన ప్రదేశాన్ని తిరిగి మట్టితో నింపి, భవిష్యత్తులో అలుగు ప్రాంతంలో మట్టి తవ్వకాలు జరపకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.