calender_icon.png 22 November, 2024 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలు

11-11-2024 02:03:25 AM

వాహనాలను సీజ్ చేసిన ఎల్లారెడ్డి తహసీల్దార్

వెంకటపూర్‌లో  ఘటన 

సిరిసిల్ల, నవంబర్ 10 (విజయక్రాంతి): ఎల్లారెడ్డిపేటలో ఆదివారం అక్రమ మట్టి రవాణాకు వ్యాపారులు తెరలేపారు. ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తవ్వి తరలిస్తున్న వాహనాలను తహసీల్దార్ సీజ్ చేశారు. రాజన్న  సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట  మండలం వెంకటపూర్ గ్రామ శివారులోని  ఒమోజయ ఆశ్రమం సమీపంలోని ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు  లేకుండా మట్టిని తవ్వి  టిప్పర్లలో తరలిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు తహసీల్దార్ రామచంద్రం ఘటన స్థలానికి వెళ్లి వాహనాలను  సీజ్  చేశారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమంగా మట్టి వ్యాపారం చేస్తే కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు.