20-03-2025 06:31:01 PM
బుడ్డ స్వర్ణలత భాగ్యరాజు తాజా మాజీ సర్పంచ్..
చేగుంట (విజయక్రాంతి): రాష్ట్రంలో చదివే పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి భయం లేకుండా, సమయస్ఫూర్తితో పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావాలని చందాయిపెట్ తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణలత భాగ్యరాజు విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ... ఆరోగ్యకరమైన సమాజం, పాఠశాల తరగతి గదిలోనే రూపు దిద్దుకుంటుందన్నారు. తరగతి గదిలో సంవత్సరం అంత చదివిన విషయాన్ని సమయస్ఫూర్తితో పరీక్ష హాల్లో ప్రజెంటేషన్ చేయడం మీ ముందున్న కర్తవ్యం అని అన్నారు. కష్టపడి పరీక్షల్లో మంచిగా రాసి మీ తల్లిదండ్రులను, గురువులను, గ్రామాన్ని మంచి పేరు తేవాలని అన్నారు.