calender_icon.png 26 November, 2024 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పెషల్ స్టేటస్‌లోనే పరీక్షలను నిర్వహించాలి

26-11-2024 12:00:00 AM

ఓయూ పరిపాలనా భవనం ఎదుట ఏబీవీపీ ధర్నా

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేయడంతో పాటు సర్టిఫికెట్లు అమ్ముకుంటూ హిందీ మహావిద్యాలయం.. అవినీతికి పాల్పడిందని ఏబీవీపీ నాయకులు ఆరోపిం చారు. ఆ సంస్థ యాజమాన్యంపై ఓయూ అధికారు లు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఇటీవల హిందీ మహావిద్యాలయం గుర్తింపును రద్దుచేయడం వలన విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని.. 2024 విద్యా సంవత్సరం పరీక్షలను స్పెషల్ స్టేటస్‌లోనే నిర్వహించా లని కోరుతూ సోమవారం వారు ఓయూ పరిపాలన భవనం ఎదుట ధర్నా చేపట్టారు.

ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అప్పటికే ఓయూ పరిపాలనా భవనం వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. ఏబీవీపీ నాయకులు  ప్రణీత్, సాయి, చరణ్ తదితరులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.