28-02-2025 02:00:15 AM
అధికారులతో కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ ఫిబ్రవరి 27 (విజయ క్రాంతి) : మార్చి 5 వ తేదీ నుండి 25 వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె కలెక్టర్ కార్యాలయం లో మినీ సమావేశ మందిరం లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ విషయమై సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయని తెలిపారు.
జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి,రెండవ సంవత్సరం పరీక్షలకు 22 483 మంది విద్యార్థినీ,విద్యార్థులు హాజరు కానున్నట్లు అధికారులు వివరించారు. ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ 8916 మంది, ఒకేషనల్ 2006 మంది మొత్తం 10922 మంది,రెండవ సంవత్సరం జనరల్(రెగ్యులర్) 8226, ఒకేషనల్ (రెగ్యులర్) 1721 మంది విద్యార్థులు,మొత్తం 9947 మంది విద్యార్థులు, జనరల్ (ప్రైవేట్) 1459 మంది,ఒకేషనల్(ప్రైవేట్) 155 మంది మొత్తం 1614 మంది, రెండవ సంవత్సరం రెగ్యులర్, ఒకేషనల్ జనరల్,ప్రైవేట్ గా మొత్తం 11561 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ ప్రశాంతంగా నిర్వహించేలా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సంబంధిత శాఖల అధికారులను కోరారు. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పరీక్షలను సవ్యం గా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు.
పరీక్షా కేంద్రం లోకి ఎవరికి సెల్ ఫోన్‌లు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, అదనపు ఎస్.పి. రాములు, అర్.డి. ఓ నవీన్,నగర కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి పార్థ సారథి,జిల్లా విద్యా శాఖ అధికారి ప్రవీ ణ్ కుమార్, జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారిణి కౌసర్ జహాన్, జిల్లా వైద్య ఆరో గ్య శాఖ, విద్యుత్, ఆర్టీసీ, సమాచార, పోస్ట ల్, తదితర శాఖల అధికారులు ఉన్నారు.