calender_icon.png 30 October, 2024 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరీక్షలు వాయిదా వేయలేం

15-07-2024 02:00:07 AM

నిరుద్యోగులు ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు

మంత్రి సీతక్క

హైదరాబాద్, జులై 14 (విజయక్రాంతి): ఉద్యోగ నియామకాలపై గత ప్రభుత్వం అం తులేని నిర్లక్ష్యం ప్రదర్శించిందని, ఆ నిర్లక్షపు నీడలు ఇప్పటికీ నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు. పరీక్షలు వాయిదా వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏలాంటి ఇబ్బంది లేదు. కానీ వాయిదా వేస్తే న్యాయ, సాంకేతిక పరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పదేళ్ల నుంచి నోటిఫికేషన్లు లేక లక్షలు ఖర్చు చేసి కోచింగ్లు తీసు కున్నవారి పరిస్థితి మరింత ఇబ్బందిగా మారుతుందని, వయోపరిమితి దాటిపోయి ఉద్యో గాలకు అర్హులు కాకుండా పోతారని.. అందుకే  షెడ్యుల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.

పరీక్షలు వాయిదా వేయాలని కొంతమంది చేస్తున్న ఆందోళన పట్ల సానుభూతి ఉన్నప్పటికీ.. విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్ ప్రకారమే నిర్వహించక తప్పని పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలకు సకాలంలో సేవలందించాలన్న పట్టుదలతోనే గ్రూప్ పరీక్షల నోటిఫికేషన్లతోపాటు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేర కు త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ఏటా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అధికారం కోల్పోయి రాజకీయ నిరుద్యోగులుగా మారిన కొందరు.. పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులను రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారు. నిరుద్యోగులు ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దని.. కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు.