calender_icon.png 29 March, 2025 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాల్ ప్రాక్టీస్ కు ఆస్కారం లేకుండా పరీక్షలు నిర్వహించాలి

26-03-2025 06:04:29 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్..

కామారెడ్డి (విజయక్రాంతి): పదవ తరగతి పరీక్షలు మాల్ ప్రాక్టీస్ కు తావు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ అన్నారు. బుధవారం కామారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పలు తరగతి గదులను చీఫ్ సూపర్డెంట్ గదులను పరిశీలించారు. అనంతరం చీఫ్ సూపర్డెంట్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడుతూ... పరీక్ష సమయానికి ముందే విద్యార్థులను నిషిత పరిశీలన చేసి పరీక్ష కేంద్రంలోకి పంపించాలని అన్నారు. మాల్ ప్రాక్టీస్కు పాల్పడకుండా పరిశీలించాలని తెలిపారు. పరీక్ష కేంద్రంలో తాగునీరు టాయిలెట్స్, మెడికల్ సౌకర్యాలు, రవాణా వంటి సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పరీక్షల చీఫ్ సూపర్డెంట్ వెంకటరమణ, డిపార్ట్మెంట్ అధికారిని మేరీ వర్ధనం, కామారెడ్డి తాసిల్దార్ జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.