కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, (విజయక్రాంతి): జనవరి 9న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వనపర్తి జిల్లా పర్యటన విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా ఉదయం 9.30 గంటలకు రెవల్లి మండలం తల్పనూర్ గ్రామంలో 33/11 కే.వి సబ్ స్టేషన్ ను ప్రారంభిస్తారు. అనంతరం గోపాలపేట మండలంలో ఎదుట్ల గ్రామంలో 33/11 కే.వి సబ్ స్టేషన్ ను ప్రారంభోత్సవం చేస్తారు.
అనంతరం వనపర్తి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం పక్కన ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణలో వనపర్తి మండలానికి చెందిన ఖాసింనగర్, చిమన్ గుంటపల్లి, మెట్టుపల్లి, నాగవరం గ్రామాలకు చెందిన( 4 ) 33/11 కే.వి., పెద్దమందడి మండలానికి చెందిన పామిరెడ్డి పల్లి గ్రామ 33/11 కే.వి., గోపాల్ పేట మండలం, చెన్నూరు గ్రామానికి సంబంధించిన 33/11 కే.వి., శ్రిరంగాపూర్ మండలం నాగరాల గ్రామానికి చెందిన 33/11 కే.వి మొత్తం 7 విద్యుత్ సబ్ స్టేషన్లకు శంఖుస్థాపన చేస్తారని తెలిపారు.
మధ్యాహ్నం కలక్టరేట్ లో అధికారుల సమావేశం ఉన్నందున ఇట్టి కార్యక్రమాలకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకొని బుధవారం కలక్టర్ వనపర్తి విద్యుత్ శాఖ కార్యాలయం, గోపాల్పేట మండలం ఎదుట్లా సబ్ స్టేషన్ ను సందర్శించి ఏర్పాట్ల పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్డీఓ సుబ్రమణ్యం, విద్యుత్ శాఖ డి.ఈ శ్రీనివాస్, తహశీల్దార్లు రమేష్ రెడ్డి, గోపాల్ పేట తహసిల్దార్ తిలక్ కుమార్ రెడ్డి, గోపాల్ పేట ఎస్.ఐ. ఇతర అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.